దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందున భూజనంబు కెల్లను - సౌఖ్య సంభ్రమాయెను ఆకసంబు నందున - మ్రోగు పాట చాటుడి దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి ఊర్ధ్వ లోకమందున - గొల్వగాను శుద్దులు అంత్య కాలమందున - కన్య గర్భమందున బుట్టినట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుడా - నిన్ను నెన్న శక్యమా దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి రావే నీతి సూర్యుడా - రావే దేవా పుత్రుడా నీదు రాక వల్లను - లోక సౌఖ్య మాయెను భూ నివాసులందరూ - మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్ము వారికి - ఆత్మ శుద్ది కల్గును దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడిJe passerai ma vie В Твоём присутствии Господь نسعى عنه سفراء Бүх гудамж маань O come xuān jiào zhī gē مش ممكن يسوع ينسانا Сени көрмеген ўақытта Dio dei miracoli Бог Ты так благ Твоя милость вовек пребывает
Song not available - connect to internet to try again?