దేవా నీ గొప్పకార్యములన్ - మదిన్ తలచి స్తుతించెదం నీ ఆశ్చర్యక్రియలను - పాడి కీర్తించెదం హల్లెలూయా నా యేసురాజ హల్లెలూయా నా ప్రాణనాథ (2) స్తుతులు మహిమ ఘనత నీకే (2) // దేవా నీ // శాశ్వత ప్రేమతో నను ప్రేమించి పరమును వీడి భువికరుదెంచి కలువరి సిలువలో రక్తము కార్చి నీదు కృపతో నను రక్షించిన నీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరింతున్ జీవిత కాలమంతా // దేవా నీ // నీ కంటిపాపగా నన్ను కాచి నీ చేతి నీడలో నన్ను దాచి నీ అరచేతిలో నను చెక్కుకొని నీదు సొత్తుగా నను చేసుకొని అక్షయమైన నీ మధుర ప్రేమను దీక్షతో ఇలలో చాటెదను // దేవా నీ //Kutsallık, Kutsallık Yıllardır Aradığım Kada Ka Yi Sujada Sai Ga Allah Каждому дан свой удел Адъм, Адъм Vero amore كلما اقتربت منك ربي Mon cœur s'incline ЖЕРТВА НА ХВАЛА Only by Grace can we Enter Dəvət etmişdir Ata səni, məni, hamını
Song not available - connect to internet to try again?