దేవుని ప్రేమఇదిగో - జనులారా భావంబునందెలియరే కేవలము నమ్ముకొనిన - పరలోక జీవంబు మనకబ్బును // దేవుని // సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో జేసెను సర్వోపకారుడుండె - మన మీద జాలిపరుడై యుండెను // దేవుని // మానవుల రక్షింపను దేవుండుతన కుమారుని బంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపములకు దూరుడే // దేవుని // యేసు క్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల దోస కారిజనులతో - నెంతో సు - భాషలను బల్కినాడు // దేవుని // పాపబారంబుతోడ నేప్రొద్దు - ప్రయాసములు బొందెడి పాపులందురు నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణ మిత్తుననెను // దేవుని // సత్తులైన పురుషులైనన్ - యాకర్త సర్వజనుల యెడలను సత్ప్రేమగ నడిచెను - పరలోక సద్భోదలిక జేసెను // దేవుని // చావు నొందిక కొందరిన్ - యేసుండు - చక్కగ బ్రతికించెను సకల వ్యాధుల రోగులు - ప్రభునంటి - స్వస్థంబు తా మొందిరి // దేవుని // గాలి సంద్రపు పొంగులన్ - సద్ధణపి - నీళ్లపై నడచినాడే మేలుగల యద్భుతములు ఈలాగు వేలకొలదిగజేసెను // దేవుని // చేతుల కాళ్లలోనూ రా రాజు - చేర మేకులు బొందెను పాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తామోర్వ లేకన్ // దేవుని // ఇన్ని బాధలు బెట్టుచు - దను జంపు - చున్న పాపరులను మన్నించుమని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను // దేవుని // రక్షకుడు శ్రమబొందగా దేశంబు తక్షణము చీకటియ్యెను రక్షకుడు మృతి నొందగా - తెర చినిగి - రాతి కొండలు పగిలెను // దేవుని/ // రాతి సమాధిలోను - రక్షకుని నీతిగల దేహంబును - పాతి పెట్టిరి భక్తులు - నమ్మిన నాదలందఱు జూడగా // దేవుని // మూడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాడు నాడు నమ్మిన మనుజులు - చూచిరి - నలువది దినములందున్ // దేవుని // పదినొకండు మారులు వారలకు - ప్రత్యక్షుడాయెనేను పరలోకమునకేగెను - తన వార్త ప్రకటించమని పల్కెను // దేవుని // నమ్మి బాప్తిస్మ మెందు - నరులకు - రక్షణ మరి కల్గును నమ్మనొల్లక పోయెడు - నరులకు నరకంబు సిద్ధమనెను // దేవుని //Ես Գալիս եմ Տաճարը Քո ạldfẗ fy ạ̹yd qbṭạn Sing to the King Vzývám Tě, Všemohoucí ЩОМ МЕ ВОДИШ Білем, Сенде мен кіммін Чудо из чудес АЛЛИЛУЯ Nech tečie rieka od tró-nu milosti إنت موجود
Song not available - connect to internet to try again?