దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని // దేవునికి // గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని // దేవునికి // నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని // దేవునికి // ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని // దేవునికి // దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి // దేవునికి // ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని // దేవునికి // పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును // దేవునికి // గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని // దేవునికి // యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని // దేవునికి // పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును // దేవునికి // భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును // దేవునికి // వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని // దేవునికి //Hava nagila خاطي جنت Grande est ta fidélité ای مسیح شکر تو را قدموا للرب يا ابناء ạ̹lhy ltkn ʿynạk بألقاك Por qué ese lamento Spasenia skalou إن عشنا للرب نعيش
Song not available - connect to internet to try again?