నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప // నడిపించు // నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము // నడిపించు // రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ // నడిపించు // ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు // నడిపించు // ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట // నడిపించు // లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పనగా లోకేష చేయుమయా // నడిపించు // ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు // నడిపించు //ạlrb yhwh ạ̹lhy جۇرەگىمە ٴجۇز قاراپ Марийн магтаал من زمان اخترتني ṭạlb mʿwnẗ Ciò che lo Spirito dice Sláva Bohu na výsosti mn ạ̉jly̱ hdẖạ mn ạ̉jly̱ Mon cœur, rempli des biens THAWHTHAN NI
Song not available - connect to internet to try again?