నన్నెంతగా ప్రేమించితివో... నిన్నంతగా దూషించితినో... నన్నెంతగా నీవెరిగితివో... నిన్నంతగా నే మరచితినో... గలనా... నే చెప్పగలనా... దాయనా ... నే దాయగలనా... (2) అయ్యా... నా యేసయ్యా... నాదం... తాళం... రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... (2) ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో... ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో ... (2) ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో... ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ... (2) // గలనా // ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో... ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో... (2) ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో... ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో... (2) // గలనా //Vrednic eşti de cinste şi-nchinare Bože, čos Alt du behøver er Ham كونوا كاملين Как могуч Ты رأيت يا الهي На заре на рассвете дня Мы увидели друг друга Жол көрсөтүүчү Иса Ашкъ
Song not available - connect to internet to try again?