నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని (2) పదే పదే పాడుతుంది నా నాలుకా (2) నీకే నా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా (2) నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా (2) నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు కేవలం నీ కృపయే (2) కేవలం నీ కృపయే // నా గుండె // నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు (2) నీ పరిపాలనలోన నా ఆత్మనుంచుట నాకెంత భాగ్యము (2) నాకెంత భాగ్యము // నా గుండె //Спасибо Тебе Господи Халелу, Халелу, Халелу, Халелуя Iso Ismi Все возьми от меня Comme un enfant Triunfante Rey de gloria أسف لأني مقلتش لأ Hamıdan ucasan Һəр јерə ҝедəрəм Рəбб Иса илə yạ ạ̹lhy yạ ḥbyby
Song not available - connect to internet to try again?