నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా నా క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చినా చాలవయ్యా నీ జీవితాన్నే నాకిచ్చినావు నీకే నా జీవమయ్యా హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4) // నా నీతి // నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగ వచ్చావుగా నా దోష శిక్ష భరియించి నీవు నను నీలో దాచావుగా ఏమంత ప్రేమ నా మీద నీకు నీ ప్రాణమిచ్చావుగా నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను యజమానుడవు నీవేగా // హల్లెలూయ // నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు నీవు చేరదీసావుగా నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి కన్నీరు తుడిచావుగా నేనున్న నీకు భయమేలనంటూ ఓదార్పునిచ్చావుగా చాలయ్య దేవ నీ కృపయే నాకు బ్రతుకంతయు పండుగా // హల్లెలూయ // ఆ ఊభిలోనా నే చిక్కినప్పుడు నీవు నన్ను చూసావుగా నీ చేయి చాపి నను పైకి లేపి నీ వాక్కునిచ్చావుగా నా సంకటములు నా ఋణపు గిరులు అన్నిటిని తీర్చావుగా నీలోన నాకు నవ జీవమిచ్చి నీ సాక్షిగా నిలిపావుగా // హల్లెలూయ //Fiume di pace Көктен келген түспесе нұрың Come to Jesus Fino a che للرب الأرض ạḥmlwạ tẖmạr ạlrwḥ shrạn mʿạk Peuple chrétien Rabbin Halkı Kalksın Když se ráno probudíš
Song not available - connect to internet to try again?