నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి (2) అంధకారములో నేనుండ (2) వెదకి నన్ రక్షించితివి (2) // నా మనో // నే పాప భారము తోడ చింతించి వగయుచునుంటి (2) కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) పొంది నన్ విడిపించితివి (2) // నా మనో // ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా (2) బాధలు శోధనలు శ్రమలలో (2) ఓదార్చి ఆదుకొంటివయా (2) // నా మనో // నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలో నే మారి (2) స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2) యుగయుగములు సర్వ యుగములు (2) // నా మనో //Добрий Забывая прошлое Vorbeşte Doamne căci sunt rob Mysli na tie davy ľudí Loué soit ton amour Та бол алдартай Cand simţi în piept amar mustrarea Isteni béke Hər şeyi Rəbbə verirəm Ah Ne Güzelsin Aşkım
Song not available - connect to internet to try again?