నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేఖలు /2/ కారు చీకటిలో కలువరి కిరణమై కఠినహృదయమును కరిగించినావు నీ కార్యములను వివరింపతరమా ? నీ ఘనకార్యములు వర్ణింపతరమా ? మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలె కృపను కురిపించితివి/2/ విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు విరజిమ్మె ఉదయకాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి /2/ అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆర్పజాలని జ్వాలగా చేసి ద్వీపస్థంభముపై నను నిలిపినావు పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు /2/ పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నను నిలిపినావుIch weiss dass mein Erlöser lebt Как быстро время бежит ручьём Pane, dnes chcem na svätom mieste stáť Өгөх өгөх тусам JESUH NIH A KAN CEUTER Искупитель Rýhyńmen asyl Tak jako sníh Бурхан Эзэн бол Таныг сахин хамгаалагч ạ̹dy bsrʿẗ
Song not available - connect to internet to try again?