నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా // నీ ధనము // ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా (2) పరలోక నాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా // నీ ధనము // పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా (2) వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా // నీ ధనము // వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2) వెలిగించ ధరపైని ప్రభు నామము కలిమికొలది ప్రభున కర్పింపవా // నీ ధనము // కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలు బాధభరితంబులు (2) బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా // నీ ధనము //Свежие слезы Cat de bine mă simt cu aleşii Domnului rạḍy bqlbk fèng xiàn zhī lù 你准备好了吗 قد تتبعت خطاك Pán Vůdce můj مجدك غطى الارض บทเพลงในดวงใจ Jeesus, luona armopöydän
Song not available - connect to internet to try again?