నీ మాట నా పాటగా అనుక్షణం పాడనీ లోకాన నిను చాటగా నా స్వరం వాడనీ అ.ప.: నా గీతం ఆత్మలను నీవైపే ఆకర్షించనీ ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించనీ ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనియించనీ పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించనీ వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించనీ // నా గీతం // నీ దివ్య గానామృతం జలధారలుగ పొంగనీ తాకేటి ప్రతివారిని ఫలవంతముగ మార్చనీ శృతిలయలు లోపించక విసిగింపు కలిగించక నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదలించనీ // నా గీతం // ఆత్మీయగీతాలతో తనువంత పులకంచనీ సంగీతమే బోధయై కనువిప్పు కలిగించనీ ఆలక్ష్యయం కోసమే పరిమితము కాకుండగ హృధయాల్లో నివసించుచూ కార్యాలు జరిగించనీ // నా గీతం //Тэнгисийн ус мэт Их Эзэний хайр ạ̉nạ lyk msẖ hạykẖyb ạ̹ymạny Прекрасны жилища Твои Господи сил Sé que tú siempre aquí estarás 恳求主 Когда сердце плачет Тэр бүхнээс хүчтэй kl ạ̉mwry ạ̉nt ʿạrfhạ Ажойибсан 1
Song not available - connect to internet to try again?