నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్ నీ రక్తమే నా బలము (2) నీ రక్త ధారలే ఇల పాపికాశ్రయంబిచ్చును (2) పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము (2) // నీ రక్తమే // నశించు వారికి నీ సిలువ వెర్రితనముగ నున్నది (2) రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియై యున్నది (2) // నీ రక్తమే // నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే (2) పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా (2) // నీ రక్తమే // పంది వలె పొర్లిన నన్ను కుక్క వలె తిరిగిన నన్ను (2) ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హ నీకే స్తోత్రము (2) // నీ రక్తమే // నన్ను వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ (2) దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే (2) // నీ రక్తమే // స్తుతి మహిమ ఘనతయు యుగయుగంబులకును (2) స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును (2) // నీ రక్తమే //I'll be a sunbeam/ Jesus wants me for a sunbeam TE LOUVAREI, SENHOR Твой съм аз ạnạ mḥtạj lmsẗ rwḥk เติบโตร่วมกัน Yagona Iso Buyuk المُحال O, gdzie żeńcy są, aby zebrać już Bárz je svetom cesta úzka Boża obecność
Song not available - connect to internet to try again?