నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీకొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నాసమస్తమా - ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నె వెంబడింతు ప్రభు అంధకారపు లోయలలో నేను నడిచితినీ ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివీ కంటి పాపగ నీవు నన్ను కాచితివీ కన్న తండ్రివి నీవనీ నిన్న కొలిచెదను ఇలలో నిన్నే కొలిచెదను నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మఫలములు దండిగా నీకై ఫలియింతును నీవు చేసిన మేళ్ళను నేనెట్లు మరుత ప్రభు నీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతును నే ఇలలో జీవింతునుStoisz u naszych drzwi أنا واثق Иисус, Ты мой лучший друг! Ты так близок, когда мне трудно Daromná je chvála Korkma, Korkma Diyor Tanrı Кайболмуш Бир Кузуйдум يسوع أنت تعلم Suflete ce stai pribeag în lume No os detengáis 我的弟兄姐妹呀
Song not available - connect to internet to try again?