నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు వెండి బంగారము ధనధాన్యాదులు ఒక్క పోగేసినా నీతో సరితూగునా జీవ నదులన్నియు సర్వ సంద్రాములు ఒక్కటై ఎగసినా నిను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక్కచోట క్రుమ్మరించినా నీవేగా మంచి దేవుడవు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెవరు పాప పరిహార్థం సిలువ మరణమొంది తిరిగి లేచిన దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా - నీవేగా మంచిదేవుడవు నేను వెదకాకున్న నాకు దొరికితివి నే ప్రేమించుకున్న నన్ను ప్రేమించితివి పలుగాయాలు చేసి తరచు రేపితిని అయినను సహించి నన్ను క్షమించితివి నీలా జాలిగల ప్రేమ గల దేవుడేడి - నీవేగా మంచి దేవుడవుMumtoz xalqing boqish uchun Pane, som tak rád ALÉM DO ÁTRIO Словно древо у потока Avia, ry sakaiza o! Мы увидели друг друга بو دونیَه بَش گونلوک عُمور! นายงานและขอทาน PATHIAN RIAN CA, KUT TAM A HERH مجدًا مجدًا مجدًا ليسـوع
Song not available - connect to internet to try again?