నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) // నీవుంటే // ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) // నీ మాట // బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) // నీ మాట // ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) // నీ మాట // నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) // నీ మాట //Až po smrť, Ježišu Көрчү, кандай Досубуз бар Kalbimin attığı yerde Господь, прости за ропот (автор Андрей Максимов) Hoy te rindo mi ser Ó Mária, Primluvnica naša, teba anjel Pánov pozdravil Біблія Dal primo mattino أنا مش وحيد 盘石盘石耶稣基督
Song not available - connect to internet to try again?