పరిశుద్ధుడు పరిశుద్ధుడు - రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచ్చును - ప్రభువుల ప్రభువు క్రీస్తు (2) గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2) ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా // పరిశుద్ధుడు // నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2) ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా ఎన్నటికీ ఓడిపోను - జయశాలి నీవుండగా // పరిశుద్ధుడు //Ó Otče, moje srdce strádá C'è un giardin Kristmas Ni Vak كەلە كۅر، ىيسا، ماعا Napred, hore domov sbḥwạ ạsm yswʿ لما هموم القلب تزيد Що слезва ангел от небе? Ты всегда со мной ДА И АМИН
Song not available - connect to internet to try again?