ప్రభు యేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను జూడ (2) అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) // ప్రభు యేసు // ప్రియుడైన యోహాను పత్మాసులో ప్రియమైన యేసు నీ స్వరూపము (2) ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) // ప్రభు యేసు // లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేనివాడ నేనైతిని (2) చక్కజేసి నా నేత్రాలు దెరచి గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) // ప్రభు యేసు // ఎరిగి యెరిగి నే చెడిపోతిని యేసు నీ గాయము రేపితిని (2) మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నన్ను జూడనిమ్ము (2) // ప్రభు యేసు // ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెల్గు ముఖమున (2) సందియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు (2) // ప్రభు యేసు // విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ కొనసాగించువాడా యేసు ప్రభూ (2) వినయముతో నేను నీ వైపు జూచుచు విసుగక పరుగెత్త నేర్పు (2) // ప్రభు యేసు // కంటికి కనబడని వెన్నియో చెవికి వినబడని వెన్నియో (2) హృదయ గోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై (2) // ప్రభు యేసు //kẖdnạ ʿly̱ jbl ʿạly Калк Парла! Jasnou rečou ИИСУС, СЭЭҢ ОРУУҢ САЛГААР МЕН kn mntṣraⁿạ تاماشا ٴتاڭىردى داڭقتاۋ You Came (Lazarus) VŽDYŤ STOJÍM NA SKÁLE We Bow Down فوق كل قوة ورياسه
Song not available - connect to internet to try again?