మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు (2) నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయములద్వారా స్వస్థతనొంది అనందించెద నీలో నేను // మహిమ స్వరూపుడా // విరిగిన మనస్సు నలిగినా హృదయం నీ కిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరిచిన రోట్టెనై ఆహారమౌదును అనేకులకు // మహిమ స్వరూపుడా // పరిశుద్ధత్మ ఫలముపొంది పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై సీయోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను // మహిమ స్వరూపుడా //خارج من أرض العُبُودِيَّه Бог мой и Царь Ty mi dávaš nádej Помоги Люблю Тебя How Majestic Бог е мой приятел A toi le règne Ogni Tua promessa لا تتركها
Song not available - connect to internet to try again?