మాట తప్పవు నీవు మారనివాడవయ్యా
అదియే నన్నిలలో బ్రతికించుచున్నది
మాటతోనే మృతులలేపినావా - మరణముల్లు విరిచిన ఓ దేవా
అదియే నా రోగము తొలగించుచున్నది
మాటతోనే చక్కచేసినావా - సర్వశక్తి కలిగిన ఓ దేవా
అదియే నీ త్రోవలో నడిపించుచున్నది
మాటతోనే బుద్ధినేర్పినావా - హృదయమును ఎరిగిన ఓ దేవా