మూడునాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా (2) నీటిబుడగలాంటి జీవితం ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) మనిషికి తన మనసే చేరసాలరా మమతలు మమకారాలు బంధాలురా (2) వల్లకాటి వరకేరా భవబంధాలు నీ కళ్లానికి చేరవురా అనుబంధాలు (2) కల్లలైన కళలు మానుకో ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) // మూడునాళ్ళ // ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము అది కనిపించీ మాయమయే రంగులవలయం (2) గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2) నిత్యమైన సుఖము వెదకరా నిరతము ప్రభుని కోరరా (2) // మూడునాళ్ళ // తప్పిదములు దాచువాడు వర్దిల్లడు అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2) జిగటగల ఊభినుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2) తీర్పు తీర్చబడకమునుపే తప్పక ఆ ప్రభుని కోరరా (2) // మూడునాళ్ళ //Bende yok altın, bende yok gümüş Aw Bethlehem tang ka tun macheng Ja jestem z wami yạ ạ̹lhy Канатларън Алтънда Saint des saints Сəнсəн һəјатын гајнағы Да воспоют Тебе все народы Takk jesus Amen Dieu est pour nous un refuge
Song not available - connect to internet to try again?