యేసయ్యా నా యేసయ్యా - ఎప్పుడయ్యా నీ రాకడ యేసయ్యా నిన్ను చూడా ఆశయ్యా రావయ్యా యేసయ్య రయమున // యేసయ్యా // అ.ప. రమ్ము రమ్ము యేసునాధా వేగమె రారమ్ము ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ చూచుటకెన్నో - వింతలున్నవి భువిలోన చూడను ఎందరో - ఘనులున్నారు ధరలోన ఏమి చూచిన - ఎవరిని చూచిన ఫలమేమి నా కన్నులారా - నిన్ను చూడాలి యేసయ్యా // రమ్ము // నా రూపమే మారునంట నిన్ను చూచువేళ నిన్ను పోలి ఉంటానంట నీవు వచ్చువేళ అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా - అందున్న సర్వసంపదలన్నీ - నా స్వంతమయ్యా // రమ్ము // అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి గొఱ్ఱెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్న అంధకారమే లేని ఆ - దివ్యనగరమందు అవధులు లేని ఆనందముతో - నీతో ఉండెదను // రమ్ము //nḥwk kl ạlạ̉mạny 何等大的慈愛 Один день Buyuk nom День спасенья Их Эзэн бидний Аав Рəбб Иса, Сəни чағырырам мəн sòng gěi nǐ yuǎn fāng qīn rén Роскошной листвою покрытый Nel suo amore
Song not available - connect to internet to try again?