రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే (2) రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము (2) సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము // రండి // మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్యము గల రాజు (2) భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయనవే // రండి // సముద్రము సృష్టించెనాయనదే సత్యుని హస్తమే భువిజేసెన్ (2) ఆయన దైవము పాలితుల ఆయన మేపెడి గొర్రెలము // రండి // ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము (2) ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును // రండి // తండ్రి కుమార శుద్దాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు గాక (2) ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను ఆమెన్ // రండి //กองทัพพระคริสต์ عارفك مش قادر Wśród nocnej ciszy Teraz w młodych życia latach 主最知道我的需要 พระเจ้าของเรา sạmʿ ʿnk Надёжный Друг Incredibile amor Султони мани
Song not available - connect to internet to try again?