విజయ గీతముల్ పాడరే - క్రీస్తుకు జయ - విజయ గీతముల్ పాడరే - వృజిన మంతటీ మీద - విజయమిచ్చేడే దేవ - నిజకుమారుని నామమునే - హృదయములతో - భజన జేయుచు నిత్యమున్ // విజయ // మంగళముగ యేసుడే - మనకు రక్షణ - శృంగమై మరినిల్చెను నింగిని విడచి వచ్చేను - శత్రుని యుద్ధ - రంగమందున గెల్చెను - రంగు మీరగదన-రక్తబలము వలన-పొంగు నణగజేసెను - సాతానుని బల్- క్రుంగ్ నిలిపి చీల్చెను // విజయ // పాపముల్ దొలగింపను-మనలను దన స్వ-రూపంబున కు మార్చను-శాపం బంతయు నోర్చెను-దేవుని న్యాయ- మున్ భరియించెను-పాపమెరుగని యేసు - పాపమై మన కొరకు-పాప యాగము దీర్చేను - దేవుని నీతిన్ - ధీరుడై నెర వేర్చెను // విజయ // సిలువ మరణము నొందియు-మనలను దనకై-గెలువన్ లేచిన వానికి - చేలువుగన్ విమాలాత్ముని-ప్రేమను మనలో - నిలువన జేసిన వానికి - కొలువు జేతుమేగాని - ఇలను మరువక వాని - సిలువ మోయుచు నీ కృపా - రక్షణ చాలా - విలువ గలదని చాటుచు // విజయ //Жүрдүм Сени тонумай فاقت أمانة ربي Mnoho je duší Подих неба Jesus, what a wonder Le train de l'évangile Unde să plec de lângă Tine Immenso per me wǒ men yīn xìn shén de ér zi 耶利哥要倒塌
Song not available - connect to internet to try again?