శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2) నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) // శ్రీ యేసుండు // కన్నియ మరియమ్మ గర్భమందున (2) ఇమ్మానుయేలనెడి నామమందున (2) // శ్రీ యేసుండు // సత్రమందున పశువులశాల యందున (2) దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) // శ్రీ యేసుండు // పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2) పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2) // శ్రీ యేసుండు // గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2) దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2) // శ్రీ యేసుండు // మన కొరకొక్క శిశువు పుట్టెను (2) ధరను మన దోషములబోగొట్టెను (2) // శ్రీ యేసుండు // పరలోకపు సైన్యంబు గూడెను (2) మింట వర రక్షకుని గూర్చి పాడెను (2) // శ్రీ యేసుండు // అక్షయుండగు యేసు పుట్టెను (2) మనకు రక్షణంబు సిద్ధపరచెను (2) // శ్రీ యేసుండు //Мы каждый день встречаемся вновь rnmwạ llh qwtnạ Ó, Pane, obživ nás! Da eu, da eu Yo marcharé ქება შენ უფალო tsạmy̱ ạlḥb Полнота обетований Nelle Tue braccia Аллах'ъм Бени Дене
Song not available - connect to internet to try again?