సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిర దారలే ఈ జగతిని విమోచించు జీవధారలు నిరపరాధి మౌనభుని దీనుడాయెను మాతృమూర్తి వేదననే ఓదార్చెను అపవాది అహంకార మణచి వేసెను పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను // సిలువ // కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను లోక మంత చీకటి ఆవరించెను శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను // సిలువ //Une nacelle en silence ВИЖДАМ ИСУС nny̱ ʿyn Blúdiš v cudzom kraji يەر۔ژاھان تولغان سېنىڭ رەھمىڭگە Wo ich auch stehe ىيىق رۇح، كەلىپ Maelfu Na Maelfu Give Thanks With a Grateful Heart Хаан Эзэний өмнө
Song not available - connect to internet to try again?