స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి // స్తోత్రం // దివారాత్రములు కంటిపాపవలె కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి // స్తోత్రం // గాడాంధకారములో కన్నీటి లోయలలో కృశించి పోనీయక కృపలతో బలపరచితివి // స్తోత్రం // సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి // స్తోత్రం // సీయోను మార్గములో పలుశోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి // స్తోత్రం // సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి // స్తోత్రం // పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా // స్తోత్రం //راجع ليك قلبي عطشان Stern, auf den ich schaue Il meglio di me Haleloia, deraina Humble King Дар ин дунёи ғамноку фонӣ Tu resterai Վառվիր Կրակ Ընդմիշտ Վառվիր اِی دُغا! La parte migliore
Song not available - connect to internet to try again?