స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2) నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం (2) // స్తోత్రము // మరణమైననూ ఎర్ర సంద్రమైననూ నీ తోడు నాకుండ భయము లేదుగా శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా బలమైన కోట నీవేగా (2) నా దుర్గమా నా శైలమా నా అతిశయమా ఆనందమా (2) // నీవే // హింసలైననూ పలు నిందలైననూ నీ చల్లని రెక్కలే నాకాశ్రయం చీకటైననూ అగాధమైననూ నీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2) నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా మంచి కాపరి (2) // నీవే //日共一轮月共一轮 Хвала Тобі Бог Отец Let Creation Sing yǒu yī tiáo lù ฉันได้วางใจในพระเจ้า Generazione senza paura Táńirdiń jolymen alǵa júremin Adj új szívet nekem Есть для плачущих земли Me da wase oo daa
Song not available - connect to internet to try again?