హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ // హల్లెలుయా // వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే (2) నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ // హల్లెలుయా // ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్ (2) ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ // హల్లెలుయా // కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును (2) నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ // హల్లెలుయా //Sevgin Rab, Ne Derin! Dáváš mi lásku vzácnou O Praise The Name Te înalţ pe Tine Domnul meu إن قلبي ليس يهوى Se etter meg Иса, Иса гел беним янъма ! Alles was atmet, lobe den Herrn Ce Nume scump ai Tu Isuse إني أحب الرب
Song not available - connect to internet to try again?