హల్లెలూయ అని పాడిస్తుతింపను రారే జనులారా మనసార ఊరూర రారే జనులారా ఊరూర నోరార పాడిపంటలనిచ్చి పాలించు దేవుడని కూడుగుడ్డనిచ్చి పోషించు దేవుడని తోడు నీడగ నిన్ను కాపాడు నాదుడని పూజించి పూజించి పాటించి చాటించరారె // హల్లే // తాత ముత్తవుల కన్న ముందున్న దేవుడని తల్లిదండ్రులకన్న ప్రేమించు దేవుడని కల్లాకపటములేని కరునా సంపన్నుడని పూజించి పూజించి పాటించి చాటించరారే // హల్లే // బంధుమిత్రులకన్న బలమైన దేవుడని అన్నదమ్ముళ్ళకన్న ప్రియమైన దేవుడని కన్నబిడ్డలకన్న కన్నుల పండుగని పూజించి పూజించ పాటించి చాటించరారే // హల్లే //De La Iglesia El Fundamento Gələrsən Keby som bol motýľom Bientôt Jésus mhmạ ạlḍyq yzyd ysẖtd ạstyqẓy พระองค์เป็น/พระองค์ทรงเป็นพระเจ้า You Are/You Are Lord 压伤的芦苇他不折断 Bože, daruj svetu pokoj Да, Ты здесь! Мы вознесём Тебя!
Song not available - connect to internet to try again?