హే ప్రభుయేసు - హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా, పాపహరా, శాంతికరా // హే ప్రభు // శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ = శాంతి స్వరూపా జీవనదీపా - శాంతి సువార్తనిధీ // సిల్వధరా // తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా = విఫలులు జేసిన విజ్ఞాపనలకు - సఫలత నీనెగదా // సిల్వధరా // మతములు వెదకిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా = పతి తులు దేవుని సుతులని నేర్పిన - హితమతి వీవేగదా // సిల్వధరా // పలుకులలో నీ శాంతి కధ తొలకరి వానగ గురిసెగదా = మమల మాడిన మానవహృదయము- కళకళాడెకదా // సిల్వధరా // ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ చేసిన నీవేగదా = ఖలముయుడగు సాతానుని గర్వము - ఖండమాయెగదా // సిల్వధరా //نصيب أهل الدنيا TAKE TIME TO BE HOLY 大能手 내 입술로 wǒ jiāng yé hé huá cháng bǎi zài wǒ miàn qián Ježiš, Priateľ navždy Everybody ought to know I'll be home for Christmas Что посеешь то пожнешь Quand je contemple cette croix
Song not available - connect to internet to try again?