ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (2) // ఇదిగో // పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం // ఇదిగో // నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము // ఇదిగో //احفظني في رضاك Бийикледеги Раббий Пусть душа холодна как лед Oň wagtynda Я не знаю что делаешь ты я славлю Господа كنت أسيرًا Köszönöm, Jézus ฉันเงยหน้ามองที่ภูผา Golgota 恳求主
Song not available - connect to internet to try again?