ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను (2) నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2) తరియించు వరమే దొరికెను (2) // ఊహించ // నా మనసు వేదనలో - నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో - తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను (2) అనాథయిన నను వెదకెను ప్రధానులలో ఉంచెను (2) // ఊహించ // నీ మరణ వేదనలో - నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో - అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను (2) ఇది నీ ప్రేమకే సాధ్యము వివరించుట నాకసాధ్యము (2) // ఊహించ //بقولك أنا غريب Әр жаңа күнде Sen men bilan birgasan Vieni a me يا رب بارك 我虽遭遇患难愁苦 Image de Dieu İsa, Qəlbimdə yaşa Иса Сен мукаддес Халасгәрим Herr, in Deinem Namen treffen wir uns hier
Song not available - connect to internet to try again?