ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2) సంతోషం ఎక్కడ ఉందనీ సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2) జగమంతా వెదికాను జనులందరినడిగాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) // ఎంత మంచి // ప్రేమనేది ఎక్కడ ఉందనీ క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2) బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) // ఎంత మంచి // సత్యమనేది ఎక్కడ ఉందనీ నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2) ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) // ఎంత మంచి //Ty jsi svatý Зірка нам явила знак mạ ạ̉jml trnymẗ Az Úrnak szüksége van rád Paso a paso Cantaré para siempre las misericordias A DAWTNAK NIH A KA CAWI Cristo vive, ya no más There Is No One Like You Anyámnak, az Egyháznak szívében szeretet leszek
Song not available - connect to internet to try again?