ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా ప్రభువు నామములో సాగే అనుబంధమా ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా ఓ కంట కన్నీరు తగదు సహవాసమా ప్రతి కష్టము మనము పంచుకుందాము కలిసి అందరము వేడుకుందాము (2) // ఓ క్రీస్తు // మనమంతా కలిసి ఆ దేవుని దేహము తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2) ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2) // ప్రతి కష్టము // సాటి సోదరులు శ్రమల పాలైనపుడు సాతాను శక్తులచే శోధింపబడినపుడు (2) ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2) // ప్రతి కష్టము // శ్రమలు పొందేవారు అవిధేయులు కారు విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2) శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2) // ప్రతి కష్టము //Tua è la gloria Une flamme en moi C'est lui qui tient la terre Алыс-шыннын Берикчизи أنا قلبي يسجد ليك Bağışla, İlahi, Sən Özün bağışla Ty si môj Pastier Se apro il mio cuore Rab Allah'ın İsmi Ulu Yücedir yạ mn bḥḍwrh
Song not available - connect to internet to try again?