ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) // ఓ యేసు // అగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2) // ఓ యేసు // సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా వింటినంటివి నా మొర్రకు ముందే తోడునుందునంటివి (2) // ఓ యేసు // కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పరుండ జేయును భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండునేసు (2) // ఓ యేసు // దేవుని గృహములో సదా స్తుతించెదనూ సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు హల్లేలూయా ఆమేన్ (2) // ఓ యేసు //Másihtegi azattyq Chiedi e riceverai Верю я в Тебя Иса Христос Воскрес! О, слава Богу! Рəбб Исам, лајигсəн, лајигсəн иззəтлəнмəјə Бу менинг тақдирим Yol Göster Bana Hakkımı Aramam Desiderio Farkon Zuwan Almasihu Daga Sama Ne Ya Zo
Song not available - connect to internet to try again?