కనులున్నా కానలేని చెవులున్నా వినలేని (2) మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని (2) వాడను యేసయ్యా ఓడిపోయిన వాడను (2) // కనులున్నా // అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని యేసయ్యా నన్ను విడువకయ్యా (2) దిక్కులేని వాడను వాడను యేసయ్యా చెదరిపోయిన గూడును (2) // కనులున్నా // భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని యేసయ్యా నన్ను కరుణించుమా (2) ఫలములేని వాడను వాసిని యేసయ్యా పేరుకు మాత్రమే విశ్వాసిని (2) // కనులున్నా // బోధ ఉన్నా బ్రతుకులేని పిలుపు ఉన్నా ప్రయాసపడని సేవ ఉన్నా సాక్ష్యములేని సంఘము ఉన్నా ఆత్మలులేని యేసయ్యా నన్ను నింపుమయ్యా (2) ఆత్మలేని వాడను పాదిరిని యేసయ్యా మాదిరి లేని కాపరిని (2) // కనులున్నా //Tövbe Günü, Sevinç Günü Saint, saint tʿạl ạ̹lyh Veľmi milujem Ťa, Pane dh bḥbh ạlʿjyb سۉيۉۉ، سۉيۉۉ، سۉيۉۉ zhāng kāi nǐ de kǒu لو لم يحبني المسيح عمانوئيل Camminerò verso te
Song not available - connect to internet to try again?