క్షణమైన నీవు నను విడచి పోలేదుగా కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2) కునుకక నిదురించక కనుపాపలా నను కాచియుంటివి (2) // క్షణమైన // పర్వతములు అన్ని తొలగిపోయినా నాదు మెట్టలన్ని చెదరిపోయినా (2) నా వెన్నంటి నా తట్టు నిలచి కన్నీటినంతా తొలగించితివి (2) నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) // క్షణమైన // శోధనలు నన్ను చుట్టుముట్టినా శ్రమలే నన్ను కృంగదీసినా (2) నా తండ్రివై నా తోడుగా నిలచి నా భారములన్ని తొలగించితివే (2) నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) // క్షణమైన //Můj Pán je se mnou Love Will Be Our Home Hosana, hosana, hosana Kráľovi Günahımı, lanetimi ماسىحتەگى ازاتتىق My za wiarę Chrystusową جه العدو يشككني เราเป็นหนึ่งเดียวกัน พระบิดาในสวรรค์ Father in Heaven How We Love You Sette sono i colori
Song not available - connect to internet to try again?