చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక - చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ - సొంపు సువార్తను జాచుచు గరములు - చక్కగా నీవైపు // చూచు // మేమరులమై యుంటిమి మార్గము వీడి - మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు - ప్రియ తనయు నంపించి క్షేమ మార్గము మాకు - బ్రేమను జూపితివి // చూచు // నిను నమ్ము పాపులకు వారెవరైనా - నీ శరము జొచ్చువారలకు ఇనుడవు కేడెంబు - నీ జగతిలో నగుచు గనుపరచుచుందువు - ఘనమైన నీ కృప // చూచు // నీ భయము మాయెదలను నిలుపుము నీదు - ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము - వైభవ మొందుచు నే భయము లేకుండ - నీ భువిని గొన్నాళ్ళు // చూచు // దయ జూచి మము నెప్పుడు మంచివి యన్ని - దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి - దయచేయుమని కోర దయ జూపి మన్నించు - దయగల మా తండ్రి // చూచు //ئەيسا رەببىم ھاياتسەن We Are An Offering เวลานี้เราจะถ่อมตัวลง Dünyanın sonu geliyor Մենք Հավաքվել Ենք Тәңірімнің Аты қамал сияқты Laat Die Hele Aarde juig Ey Kardeşler, Hak Olan Ne Varsa Алиллуйя قام حقًا
Song not available - connect to internet to try again?