తప్పిపోయిన కుమారుడనయ్యా తరలి తిరిగి వస్తున్న తనయుడనయ్యా కాదనకయ్యా నా కన్న తండ్రి తనయుడిగా కాదు నీ దాసుడిగా ఉంటా (2) అంతులేని ఆశలతో ఆస్తినంత పంచుకొని పరిహాసకులనే స్నేహితులుగ ఎంచుకొని (2) ఆస్తి అంత కోల్పోయి అనాథగా వస్తున్నా ఆదరించువారు లేక అలమటిస్తు వస్తున్నా (2) // కాదనకయ్యా // పూట పూట కూటి కొరకు ఆకలితో అలమటిస్తు పొట్ట నింపుకొనుట కొరకు పంది పొట్టుకాశపడుచు (2) ఆ పొట్టు కూడ నోచుకోని దీన స్థితిలో వస్తున్నా తండ్రి నీవు గుర్తొచ్చి తరలి తిరిగి వస్తున్నా (2) // కాదనకయ్యా //أخلـق فـي قلبـاً جديـد Указан путь им был звездой Mustahkam Qalam الله قوة لنا افرحي يا نفسي Nunca habrá historia más preciosa 在外的日子 Yeşua Масиҳ келди Jezu, jako pastýř voď nás
Song not available - connect to internet to try again?