నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2) కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా (2) // నా కోసమా // నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2) నీ చేతులలో... నీ పాదాలలో... నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే (2) యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) // నా కోసమా // నా మనస్సులో చెడు తలంపులకై నా హృదిలో చేసిన అవిధేయతకై (2) నీ శిరస్సుపై... నీ శరీరముపై... నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే (2) యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) // నా కోసమా //Ő az út, az élet باركي يا نفسي الرب وكل ما في باطني Strong Tower నా హృదయములో నీ మాటలే Птица в клетке Du bist mein Hirte Mum loves me Choď, nádhernú zvesť hlásaj نعظم اسم يسوع Как хорошо в Боге
Song not available - connect to internet to try again?