నా గీతారాధనలో-యేసయ్యా నీ కృప ఆధారమే నా ఆవేదనలలో-జనించెనే నీ కృపాదరణ నీ కృప నాలో వ్యర్థము కాలేదు- నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే // నా గీతా // చేనిలోని పైరు చేతికిరాకున్నా- ఫలములన్ని రాలిపోయిన సిరిసంపదలన్నీ దూరమైపోయిన-నేను చల్లించనులే నిశ్చలమైన రాజ్యముకొరకే- ఎల్లవేళల నిన్నే ఆరాధింతునే // నా గీతా // ఆత్మాభిషేకం-నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే ఆత్మతో సత్యముతో ఆరాధించుచు-నే వేచియుందునే నీ రాకడకై // నా గీతా //The Table داۋسىڭدى ەستيمىن God is our Father اية هي حقيقة ايمانك Алт мөнгөний аль нь ч Хозяин добрый добродушный Királyok Йюдже Танръм يهتم بي سمعت صوتك يدعو
Song not available - connect to internet to try again?