నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని (2) పదే పదే పాడుతుంది నా నాలుకా (2) నీకే నా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా (2) నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా (2) నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు కేవలం నీ కృపయే (2) కేవలం నీ కృపయే // నా గుండె // నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు (2) నీ పరిపాలనలోన నా ఆత్మనుంచుట నాకెంత భాగ్యము (2) నాకెంత భాగ్యము // నా గుండె //حبيتني وأنا خاطي Her zaman benimle, sevgi yaşasın تعليق 4 祝福 Царь живых Царь святых Jam winny krzew, a wy latoroślami Исо Ҳалқлар Умиди Vzývám a slavím Tvé jméno Di chi temerò Зиреҳи Худо
Song not available - connect to internet to try again?