నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేఖలు /2/ కారు చీకటిలో కలువరి కిరణమై కఠినహృదయమును కరిగించినావు నీ కార్యములను వివరింపతరమా ? నీ ఘనకార్యములు వర్ణింపతరమా ? మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలె కృపను కురిపించితివి/2/ విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు విరజిమ్మె ఉదయకాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి /2/ అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆర్పజాలని జ్వాలగా చేసి ద్వీపస్థంభముపై నను నిలిపినావు పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు /2/ పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నను నిలిపినావుكل عام Yol Açansın smʿt ṣwt ḥbyby Czemuż się mam tak smętny Беззащитны тьмой объяты qdmwạ llrb Слова Аллахъм Гючлюсюн Аллаһа Һəмдлəр عيلة الحيوانات
Song not available - connect to internet to try again?