నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను (2) రాజా రాజా రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవాది దేవుడవు (2) // నిత్యము // అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా (2) అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు (2) // రాజా // జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా (2) జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి (2) // రాజా // మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా (2) మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా (2) // రాజా //myzt ṣwt rby Luchad, luchad por Cristo Ach, oby Zbawcy wzór cierpienia Aici suntem străini qṣẗ ḥbk Коруян Кайъран سۇراڭدار Хвалите Господа все народы Сказал Господь мне очень тихо Моргул
Song not available - connect to internet to try again?