నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీకొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నాసమస్తమా - ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి(2) నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నె వెంబడింతు ప్రభు // నా ప్రాణ // అంధకారపు లోయలలో నేను నడిచితినీ ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివీ(2) కంటి పాపగ నీవు నన్ను కాచితివీ కన్న తండ్రివి నీవనీ నిన్న కొలిచెదను ఇలలో నిన్నే కొలిచెదను // నా ప్రాణ // నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మఫలములు దండిగా నీకై ఫలియింతును(2) నీవు చేసిన మేళ్ళను నేనెట్లు మరుత ప్రభు నీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతును నే ఇలలో జీవింతును // నా ప్రాణ //Voi ostaşi 'nainte mergeţi cu Hristos Degno sei Signor God Is so Good Luon katseen maahan mä valoisaan Poutníčkové, kam kráčíte adide upali o sulo chemo О молодість моя Shilo Lurianne Za dar slova, náš Pane Prečo stojíš vonku, Pane
Song not available - connect to internet to try again?