నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2) యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2) పరమును చేరగ నే వెళ్లెద (2) హనోకు వలె సాగెదా // నే సాగెద // వెనుక శత్రువులు వెంటాడిననూ (2) ముందు సముద్రము ఎదురొచ్చినా (2) మోషె వలె సాగెదా // నే సాగెద // లోకపు శ్రమలు నన్నెదిరించినా (2) కఠినులు రాళ్ళతో హింసించినా (2) స్తెఫను వలె సాగెదా // నే సాగెద // బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2) క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2) పౌలు వలె సాగెదా // నే సాగెద // తల్లి మరచిన తండ్రి విడచిన (2) బంధువులే నన్ను వెలివేసినా (2) బలవంతుని వలె సాగెదా // నే సాగెద //Gud er på tronen ennu Jésus, Jésus, Jésus Тэнгэр дэх Аав минь ээ To the Ends of the Earth అన్నివేళలా ఆదరించెడి Benim Tek İsteğim Любимым людям 主命定我们的路 Шепни, Господь من غير كُسوف
Song not available - connect to internet to try again?