పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నా పాటగా మరీ మరీ నేను చాటుకోనా మనసంతా పులకించ నీ సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగం నీవే మమతల మహారాజా - యేసురాజా మమతల మహారాజ - నా యేసురాజా అడగక ముందే అక్కర లెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా అవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను పెంచిన భాగ్యవంతుడా // ప // అలిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే నలిగిన వేళ నాదరిచేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే అనురాగం పంచిన అమ్మవు నీవే నమ్మకాన్నీ పెంచిన నాన్నవునీవే // ప //Я знаю Господи Иса Сені сүйемін İnanırım Tek Allah'a وأما منتظروا الرب Müjde Ezgisi Ҝəлдим һүзуруна ҝөз јашларыјла Chrétiens, peuple fidèle Give You Glory الله أمين وأب صالح Cristo es la Peña de Horeb
Song not available - connect to internet to try again?