ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి - పరిశుద్ధ గ్రంధాన్ని చేతపట్టి దీక్షతో నడుంకట్టి - ఇంటింటి తలుపు తట్టి యేసయ్య మాట (ఊసి) చెప్పవమ్మా ఊరకునే ఉంటే తప్పమ్మా // ముస // ఆ ఇంటి సంగతులన్నీ - ఈ ఇంటికి మోసావమ్మా పొరిగింటి విషయాలన్నీ - చాటింపు వేసావమ్మా ఇక్కడ మాటలు అక్కడ చెప్పి-మంచిని చెడుగా (తిప్పి) కొండాలు చెప్పవదమ్మా- జగడాలు పెట్టకు పెద్దమ్మా // ముస // కల్పించిన కథలకంటే - చెవి కోసుకొంటావమ్మా చెడుమాటల సభలంటే - నువ్వే ముందాటవమ్మా విన్నదానికి కొసరు వేసి - ఉన్నదాన్ని మార్చివేసి రెచ్చగొట్టే పనులు మానమ్మా- చిచ్చుబెట్టకే చిన్నమ్మా // ముస // మంచిగ ఉన్నాళ్ళని చూస్తే - కన్నెర్ర చేస్తావమ్మా హెచ్చరింపబడుతూ వుంటే - అపనిందలు వేస్తావమ్మా వ్యంగ్యపు మాటలు కత్తులు దూసి - చల్లగ గుండెను కోసి గాయాలు చేయ్యవద్దమ్మా- నోటికి వుండాలి హద్దమ్మా // ముస //AMPY HO ANAY NY FAHASOAVANAO La Única Esperanza بارفع اسم إلهي Un medic bun noi toti avem Várj és ne félj Если верить lwlạ ạlrb ạsẖfy ạ̹rạdty Umučenia drahého Дълго лутах се в света
Song not available - connect to internet to try again?