మూడునాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా (2) నీటిబుడగలాంటి జీవితం ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) మనిషికి తన మనసే చేరసాలరా మమతలు మమకారాలు బంధాలురా (2) వల్లకాటి వరకేరా భవబంధాలు నీ కళ్లానికి చేరవురా అనుబంధాలు (2) కల్లలైన కళలు మానుకో ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) // మూడునాళ్ళ // ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము అది కనిపించీ మాయమయే రంగులవలయం (2) గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2) నిత్యమైన సుఖము వెదకరా నిరతము ప్రభుని కోరరా (2) // మూడునాళ్ళ // తప్పిదములు దాచువాడు వర్దిల్లడు అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2) జిగటగల ఊభినుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2) తీర్పు తీర్చబడకమునుపే తప్పక ఆ ప్రభుని కోరరా (2) // మూడునాళ్ళ //Všetko čo má dych انت قادر Osana lui Dumnezeu osana La mattina lodo il Signore كما يشتاق الإيل Pójdżmy wszyscy do stajenki مهما العالم Gioia nel Signor mstḥq Һәлигәр түн зинданидин
Song not available - connect to internet to try again?